పేద విద్యార్థుల అభ్యున్నతికి సహకరించాలి
శ్రీనివాసపురం (హుజూర్‌నగర్ రూరల్) : పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి దాతలు సహకరించాలని ఎంఈఓ లక్‌పతినాయక్ కోరారు. మండలంలోని శ్రీనివాసపురం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయుడు చెరుకు రామాంజనేయ శాస్త్రి ఇచ్చిన రూ. 5 వేల విలువైన పుస్తకాలు, ఇతర సామగ్రిని ఎంఈఓ శనివారం విద్యార్థులకు అందజేశారు.
శ్రీనివాసపురం (హుజూర్‌నగర్ రూరల్) : పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి దాతలు సహకరించాలని ఎంఈఓ లక్‌పతినాయక్ కోరారు. మండలంలోని శ్రీనివాసపురం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయుడు చెరుకు రామాంజనేయ శాస్త్రి ఇచ్చిన రూ. 5 వేల విలువైన పుస్తకాలు, ఇతర సామగ్రిని ఎంఈఓ శనివారం విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారంతో పాటు గ్రామస్తులూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో యూపీఎస్ హెచ్‌ఎం దేవరం రాంరెడ్డి, ఉపాధ్యాయులు, సీఆర్‌పీ చిక్కుళ్ల గోవిందు, సైదులు, విజయ్‌కుమార్, రామాంజనేయ శాస్త్రి, శ్రీను, జానీ బేగం, రవికిషోర్, అనిల్‌రెడ్డి, లావణ్య, స్పందన పాల్గొన్నారు.