కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి | contractl lecturers problems | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి

Dec 23 2016 11:04 PM | Updated on Sep 4 2017 11:26 PM

గ్రామంలోని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇంటిని కాంట్రాక్టు అధ్యాపకులు శుక్రవారం ముట్టడించారు. అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు వై. రాజాచౌదరి ఆధ్వర్యంలో వారు ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు.

  • ఎమ్మెల్యే తోట ఇల్లు ముట్టడి
  • వెంకటాయపాలెం (రామచంద్రపురం రూరల్‌) :
    గ్రామంలోని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇంటిని కాంట్రాక్టు అధ్యాపకులు శుక్రవారం ముట్టడించారు. అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు వై. రాజాచౌదరి ఆధ్వర్యంలో వారు ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు.  ఎమ్మెల్యే  వారి వద్దకు వచ్చి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధ్యాపకులు పెదపూడి సురేష్‌బాబు, దడాల శ్రీనివాస్, కె. లక్షీ్మదేవి, డి. సోమరాజు, డి. రామ్మూర్తి, అపర్ణ రామలక్ష్మి ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందించారు. సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వటంతో వారు ధర్నాను విరమించారు. 
     

Advertisement
 
Advertisement
Advertisement