Sakshi News home page

కంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయండి...

Published Wed, Nov 23 2016 1:06 AM

Contract lecturers Demand Regularized

రామాయంపేట: అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల కంట్రాక్టు లెక్చరర్లు డిమాండ్ చేశారు.  మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ సుప్రింకోర్టు ఆదేశాలమేరకు తమకు పెంచిన వేతనాలు చెల్లించాలన్నారు.  అంతేగాకుండా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ అరుణకు వినతిపత్రం అందజేశారు. వినతి పత్రం ఇచ్చినవారిలో కంట్రాక్టు లెక్చరర్లు బాపూరావు, అశోక్, దీప్లానాయక్, నర్సింలుగౌడ్, శ్రీదేవి, మాదవి, హాజీమా తదితరులు ఉన్నారు. 
 
 టేక్మాల్: కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను పరిష్కరించాలి స్థానిక జూనియర్ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్లు ప్రిన్సిపాల్ సత్యనారాయణకు మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ... గతంలో కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యూలర్ చేస్తానని హమీ ఇచ్చిన ప్రభుత్వం నేటికీ చేయలేదన్నారు. కనీసం వేతనాలను కూడా పెంచడంలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమ సమస్యలను నేడు హైదరాబాద్‌లో జరిగే ప్రిన్సిపల్ రివ్యూమీటింగ్‌లో విద్యాశాఖామంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. వినతి పత్రం ఇచ్చినవారిలో కాంట్రాక్టు లెక్చరర్లు శ్రీనివాస్, రఘునాథరావు, పరమేశ్వర్, సంజీవ్, బాలేశ్వరమ్మ, అనిత ఉన్నారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement