సీఎం దృష్టికి కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు | contract lecturer | Sakshi
Sakshi News home page

సీఎం దృష్టికి కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు

Jul 31 2016 11:45 PM | Updated on Sep 4 2017 7:13 AM

మాట్లాడుతున్న లక్ష్మునాయుడు

మాట్లాడుతున్న లక్ష్మునాయుడు

కాంట్రాక్టు లెక్చరర్ల కంటిన్యుయేషన్, రెగ్యులరైజేషన్‌ తదితర సమస్యలపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఇటీవల నివేదిక అందజేసినట్లు తెలుగునాడు రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్‌ లెక్చరర్ల అసోసియేషన్‌ రాష్ట్ర ఫౌండర్, చైర్మన్‌ డి.లక్ష్మునాయుడు తెలిపారు.

శ్రీకాకుళం : కాంట్రాక్టు లెక్చరర్ల కంటిన్యుయేషన్, రెగ్యులరైజేషన్‌ తదితర సమస్యలపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఇటీవల నివేదిక అందజేసినట్లు తెలుగునాడు రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్‌ లెక్చరర్ల అసోసియేషన్‌ రాష్ట్ర ఫౌండర్, చైర్మన్‌ డి.లక్ష్మునాయుడు  తెలిపారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చరర్లు అందరూ కష్టకాలంలో ఉన్నందున ప్రతి ఒక్కరూ సహనంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. అంతకుముందు వన భారతి–జనహారతి కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం. బాబూరావు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షుడు పి.మల్లేశ్వరరావు, కార్యదర్శి రవికుమార్, సంఘ కోశాధికారి బి.హేమరాజు, కె.ముకుందరావు, కె.శ్రీనివాసరావు, ఎ.దశరథరావు తదితరులు పాల్గొన్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement