ఆషాఢమని భార్య పుట్టింటికి వెళితే..

Contract Lecturer Takes Advantage Of Girl Student After Wife Goes To Her Parents House In Tiruvuru - Sakshi

బాలికను మోసగించిన కేసులో డీఎస్పీ దర్యాప్తు

సాక్షి, తిరువూరు(కృష్ణా): ఏ కొండూరు పోలీసుస్టేషను పరిధిలోని కంభంపాడులో ఐదు రోజుల క్రితం బాలికను కళాశాల కాంట్రాక్టు అధ్యాపకుడు మోసగించిన కేసును ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ డీఎస్పీ విజయరావు ఆదివారం విచారణ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాలు.. వల్లంపట్లకు చెందిన ఎం.గోపికృష్ణ, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నాడు. నెలరోజుల క్రితం వివాహం అయింది. ఆషాఢ మాసం కావడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. అదే కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి విశాఖపట్నం తీసుకెళ్లాడు. ఆ అధ్యాపకుడిని కుటుంబ సభ్యులు శనివారం రాత్రి ఏకొండూరు పోలీసుస్టేషనుకు తీసుకొచ్చారు.

బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారిణ చేసి పోలీసులు బాలికను తిరువూరులోని స్వధార్‌హోంకు తరలించారు. ఫోక్సా చట్టం కింద నమోదైన కేసును డీఎస్పీ విచారణ చేస్తున్నారు. ఏ కొండూరు పోలీసుస్టేషనులో ఉన్న నిందితుడిని కూడా డీఎస్పీ ప్రశ్నించారు. తిరువూరు సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్, నూజివీడు టౌన్, తిరువూరు సెక్టార్‌ 2, ఏ కొండూరు ఎస్‌ఐలు కనకదుర్గ, అవినాష్, ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి విచారణలో పాల్గొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top