రైఫిల్‌ షూటింగ్‌లో ప్రతిభ | Competiters rocking in rifile shooting competion | Sakshi
Sakshi News home page

రైఫిల్‌ షూటింగ్‌లో ప్రతిభ

Oct 18 2016 11:24 PM | Updated on Sep 4 2017 5:36 PM

రైఫిల్‌ షూటింగ్‌లో ప్రతిభ

రైఫిల్‌ షూటింగ్‌లో ప్రతిభ

వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇటీవల జరిగిన 62వ రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ అండర్‌–19 రైఫిల్‌..

గుంటూరు స్పోర్ట్స్‌: వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇటీవల జరిగిన 62వ రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ అండర్‌–19 రైఫిల్‌ షూటింగ్‌లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చి 3 కాంస్య పతకాలు సాధించారు. యక్కలూరి శ్రీనిత్య  బాలికల పిప్‌ సైట్‌ ఈవెంట్‌లో, ఎం.రిషిత ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో , బాలుర ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో హర్షవర్ధన్‌ రెడ్డి కాంస్య పతకం సాధించి  జాతీయ స్థాయి పోటీలకు  ఎంపికయ్యారు. వీరిని మంగళవారం స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి ప్రసాద్, ఫిజికల్‌ డైరెక్టర్‌ ఎం.సంజీవరెడ్డి, డీబీఈఓ రామకృష్ణ  పరమహంస అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement