వ్యాపారులకు అందలం | Commercial merchants have benefits | Sakshi
Sakshi News home page

వ్యాపారులకు అందలం

Aug 6 2016 7:25 PM | Updated on Sep 4 2017 8:09 AM

వ్యాపారులకు అందలం

వ్యాపారులకు అందలం

కార్పొరేట్‌ వర్గాలకు రెడ్‌ కార్పెట్‌ వేస్తూ.. కంత్రీగాళ్లకు కొమ్ముకాస్తూ.. బడా పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూరుస్తూ, సామాన్య ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపేలా చంద్రబాబు సర్కారు రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచిందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి అప్పిరెడ్డి 
సీఆర్‌డీఏ పరిధిలో భూములు, 
భవనాల రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపుపై మండిపాటు
 
పట్నంబజారు : కార్పొరేట్‌ వర్గాలకు రెడ్‌ కార్పెట్‌ వేస్తూ.. కంత్రీగాళ్లకు కొమ్ముకాస్తూ.. బడా పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూరుస్తూ, సామాన్య ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపేలా చంద్రబాబు సర్కారు రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచిందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా సీఆర్‌డీఏ పరిధిలో భూములు, భవనాల రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచడంపై రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ జిల్లా రిజిస్ట్రార్‌ కె.శ్రీనివాసరావుకు శుక్రవారం వినతిపత్రం ఇచ్చారు. అనంతరం అప్పిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు రెండేళ్ల పాలనలో అడుగడుగునా చట్టాలు తుంగలో తొక్కుతూ ఆదాయం కోసం హడావుడిగా జీవోలు విడుదల చేయడంపై మండిపడ్డారు. సీఆర్‌డీఏ పరిధిలో టీడీపీకి చెందిన బడా వ్యాపార వేత్తలకు లబ్ధి చేకూర్చేలా జీవో విడుదల చేయడం సమంజసమేనా అని నిలదీశారు. బడా వ్యాపారులకు అన్నం.. సామాన్యులకు సున్నం అన్నచందంగా చంద్రబాబు సర్కారు రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచిందని ఎద్దేవా చేశారు. పెంచిన రిజిస్ట్రేషన్‌ చార్జిల జీవోను తక్షణమే ఉపసంహరించుకుని చార్జీల పెంపుపై ప్రజాభిప్రాయం సేకరించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రజలకు వెలుసుబాటు ఇవ్వకుండా గంటల్లోనే రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం చేస్తున్న వికృత చేష్టలకు ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement