సిగరెట్‌కు వచ్చి.. గొలుసు స్నాచింగ్‌ | Come for cigarate did chain snaching | Sakshi
Sakshi News home page

సిగరెట్‌కు వచ్చి.. గొలుసు స్నాచింగ్‌

Sep 25 2016 11:03 PM | Updated on Sep 4 2017 2:58 PM

సిగరెట్‌ కావాలని వచ్చి పుస్తెలతాడు తెంచుకెళ్లిన ఘటన దుండిగల్‌ ఠాణా పరిధిలో జరిగింది.

దుండిగల్‌: సిగరెట్‌ కావాలని వచ్చి పుస్తెలతాడు తెంచుకెళ్లిన ఘటన దుండిగల్‌ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... సూరారం కాలనీ 60 గజాలకు చెందిన పట్టిపతి మణి (34) డీపోచంపల్లి సర్వే నెంబర్‌ 120 ప్రధాన రోడ్డులో టీకొట్టు నిర్వహిస్తోంది. శనివారం మధ్యాహ్నం బైక్‌పై ఇద్దరు యువకులు టీకొట్టు వద్దకు వచ్చారు.

వారిలో ఒకడు సిగరెట్‌ కావాలని అడిగి అమాంతం మణి మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడు తెంచుకొని.. మరో యువకుడితో కలిసి బైక్‌పై మేడ్చల్‌ వైపు పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల వయసు 20 నుంచి 25 మధ్య ఉంటుందని, ఇద్దరూ హెల్మెట్లు, రెయిన్ కోట్‌ ధరించారని మణి పోలీసులకు తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement