విజేతగా కలెక్టరేట్‌ జట్టు

విజేతగా కలెక్టరేట్‌ జట్టు - Sakshi


- ముగిసిన రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలుఅనంతపురం సప్తగిరిసర్కిల్‌ : రెవెన్యూ ఉద్యోగుల క్రికెట్‌ విజేతగా కలెక్టరేట్‌ జట్టు నిలిచింది. అనంత క్రీడా మైదానంలో జరిగిన ఫైనల్‌ పోరులో అనంతపురం జట్టుపై విజయం సాధించింది. రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు ఆదివారంతో ముగిశాయి. చివరిరోజు అనంత క్రీడా మైదానంలో అథ్లెటిక్స్, లాంగ్‌జంప్, బాల్‌ బ్యాడ్మింటన్, క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు జరిగాయి. పోటీల్లో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రెవెన్యూ ఉద్యోగుల క్రీడలు రెండు రోజుల నుంచి నగరంలోని ఇండోర్‌ స్టేడియం, అనంత క్రీడా మైదానం, పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్, కృష్ణ కళామందిరాల్లో నిర్వహించారు. జిల్లాలోని 6 సబ్‌ డివిజన్లలోని క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేశారు.విజేతగా కలెక్టరేట్‌ జట్టు

ఆదివారం జరిగిన తుదిపోరులో అనంతపురం, కలెక్టరేట్‌ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన కలెక్టరేట్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. జట్టులో అక్రం 45 పరుగులు చేసి జట్టుకు భారీ లక్ష్యాన్ని అందించాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అనంతపురం జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 126 పరుగులు మాత్రమే చేసింది.వ్యాఖ్యాతగా కలెక్టర్‌ కోన శశిధర్‌

అనంతపురం జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ క్రికెట్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆదివారం స్థానిక అనంత క్రీడా మైదానంలో జరిగిన రెవెన్యూ ఉద్యోగుల క్రికెట్‌కు ఆయన తన కామెంట్రీతో అలరించారు. కలెక్టరేట్‌ జట్టు విజయం దిశగా పయనించే సమయంలో ఆయన తన కామెంట్ల ద్వారా క్రీడాకారుల్లో ఉత్తేజాన్ని నింపారు. కార్యక్రమంలో అనంతపురం ఆర్డీఓ మలోలా, జిల్లా రెవెన్యూ సంఘం అ«ధ్యక్షులు జయరామప్ప, భాస్కర్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఆర్‌ఐ హరిప్రసాద్, నిజాం పాల్గొన్నారు.చివరిరోజు విజేతలు వీరే..

100 మీ పరుగు పందెం పురుషులు

అశోక్‌ చక్రవర్తి–కదిరి–ప్రథమ స్థానం

రమేష్‌–అనంతపురం–ద్వితీయ స్థానం

నరసింహులు–ధర్మవరం–తృతీయ స్థానం4“100 రిలే పరుగు పందెం పురుషులు

అనంతపురం–రమేష్‌ టీం–ప్రథమ స్థానం

కళ్యాణదుర్గం–తరుణ్‌ టీం–ద్వితీయ స్థానం

ధర్మవరం–ప్రభంజన్‌రెడ్డి టీం–తృతీయ స్థానం4“100 మహిళలు

లహరిక టీం–ప్రథమ స్థానం

నందిని టీం–ద్వితీయ స్థానం

బాలమ్మ టీం–తృతీయ స్థానంలాంగ్‌ జంప్‌–పురుషులు

రమేష్‌–అనంతపురం–ప్రథమ స్థానం

అశోక్‌ చక్రవర్తి–కదిరి–ద్వితీయ స్థానం

లోకేష్‌–కళ్యాణదుర్గం–తృతీయ స్థానంబాల్‌ బ్యాడ్మింటన్‌ పురుషులు

ధర్మవరం–ప్రథమ స్థానం

కదిరి–ద్వితీయ స్థానం

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top