స్వల్పంగా పెరిగిన చలి | cold temperature increases in city | Sakshi
Sakshi News home page

స్వల్పంగా పెరిగిన చలి

Oct 27 2016 11:57 PM | Updated on Sep 4 2018 5:24 PM

నగరంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. శీతల గాలులు సిటీజన్లను జగజలాడిస్తున్నాయి.

సాక్షి, సిటీబ్యూరో : నగరంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఉత్తర, దక్షిణ దిశల నుంచి వీస్తున్న శీతల గాలులు సిటీజన్లను గజగజలాడిస్తున్నాయి. గురువారం గరిష్టంగా 31.6 డిగ్రీలు, కనిష్టంగా 17.8 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 34 శాతంగా నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. మేఘాల ఉధృతి తగ్గడంతో రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతున్నాయన్నారు. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయన్నారు. కాగా, తెల్లవారుఝామున, రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరగడంతో సిటీజన్లు స్వెట్టర్లు, మఫ్లర్లు ధరించి బయటికి వెళ్లాల్సి వస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement