రాష్ట్ర అభివృద్ధికి సీఎం కృషి
సూర్యాపేటమున్సిపాలిటీ : రాష్ట్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి అన్నారు.
సూర్యాపేటమున్సిపాలిటీ : రాష్ట్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి అన్నారు. సోమవారం 1969 తొలిదశ ఉద్యమకారుల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ పేద ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. అమరుల కుటుంబాలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. తొలిదశ ఉద్యమ పునాదులై మలిదశలో ఉద్యమ భాగస్వాములైన తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తింపు కార్డులు ఇచ్చి పింఛన్ సౌకర్యం కల్పిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నీలకంఠం చలమంద, వర్కింగ్ ప్రసిడెంట్ కోటేశ్వర్‌రావు, వెంకటేశం, లక్ష్మారెడ్డి, ముత్తారెడ్డి, అమీద్‌ఖాన్, వీరయ్య, రామనర్సయ్య, ధర్మయ్య, వెంపటి మనోహర్, కాశయ్య, విశ్వేశ్వర్‌రావు, మల్లయ్య, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.