‘బాబు యువతను నట్టేట ముంచారు’ | cm cheated | Sakshi
Sakshi News home page

‘బాబు యువతను నట్టేట ముంచారు’

Jul 19 2016 10:21 PM | Updated on Sep 4 2017 5:19 AM

నిరుద్యోగ యువతను చంద్రబాబు మోసం చేశారని నిరుద్యోగ పోరాట సమితి అధ్యక్షుడు తల సముద్రం సూర్యం విమర్శించారు. శ్రీ కాకుళం పట్టణంలో ఎస్సీ మేనేజ్‌మెంట్‌ హాస్టల్‌లో మంగళవారం ఆయన విద్యా ర్థులు, నిరుద్యోగులతో సమావేశం నిర్వహించారు.

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): నిరుద్యోగ యువతను చంద్రబాబు మోసం చేశారని నిరుద్యోగ పోరాట సమితి అధ్యక్షుడు తల సముద్రం సూర్యం విమర్శించారు. శ్రీ కాకుళం పట్టణంలో ఎస్సీ మేనేజ్‌మెంట్‌ హాస్టల్‌లో మంగళవారం ఆయన విద్యా ర్థులు, నిరుద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ముందు ఇంటికో ఉ ద్యోగం అని చెప్పి అధికారం వచ్చాక ఆ మాట మర్చిపోయారని అన్నారు. రాష్ట్రం లో లక్షన్నర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చే యాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో ఉన్న కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని రెగ్యులర్‌ చేయాలని కోరారు. అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మొజ్జాడ యుగంధర్‌ మాట్లాడుతూ విద్య, వైద్యంలో విచ్చలవిడిగా వ్యాపారం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement