చిరంజీవికి విద్యార్థుల నివాళి | chiranjeevi, students, nivali | Sakshi
Sakshi News home page

చిరంజీవికి విద్యార్థుల నివాళి

Aug 1 2016 10:26 PM | Updated on Sep 4 2017 7:22 AM

ర్యాలీ చేస్తున్న విద్యార్థులు

ర్యాలీ చేస్తున్న విద్యార్థులు

బ్రెయిన్‌డెడ్‌కు గురై అవయవదానంతో ఇతరులకు జీవం పోసిన చిరంజీవిరెడ్డికి సోమవారం పద్మావతి మహిళా జూనియర్‌ కళాశాల విద్యార్థులు నివాళి అర్పించారు.

యూనివర్సిటీక్యాంపస్‌: బ్రెయిన్‌డెడ్‌కు గురై అవయవదానంతో ఇతరులకు జీవం పోసిన చిరంజీవిరెడ్డికి సోమవారం పద్మావతి మహిళా జూనియర్‌ కళాశాల విద్యార్థులు నివాళి అర్పించారు. చిరంజీవి ఇదే కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఆదివారం మృతిచెందిన సంగతి తెలిసిందే. అనంతరం అతని అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. చనిపోతూ పలువురికి జీవం పోసిన చిరంజీవి మృతికి నివాళిగా విద్యార్థులు  కళాశాల నుంచి గాంధీపురంలోని ఆయన నివాసగృహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ రమేష్‌బాబు మాట్లాడుతూ తమ కళాశాలలో పనిచేస్తున్న చిరంజీవిరెడ్డి తన అవయవాలను దానం చేయాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ప్రశంసించారు. చిరంజీవిగా తనపేరును సార్థకం చేసుకున్నారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement