నానమ్మతో జైలుకు.. | childern go to Prison with grandmam | Sakshi
Sakshi News home page

నానమ్మతో జైలుకు

Aug 5 2016 10:05 AM | Updated on Sep 4 2017 7:50 AM

నానమ్మతో జైలుకు..

నానమ్మతో జైలుకు..

రామగుండం ఎన్టీపీసీలో ఓ మహిళ బలవన్మరణ చిన్నారులు నానమ్మతో జైలుకు వెళ్లేందుకు కారణమైంది.

జ్యోతినగర్‌ (కరీంనగర్):  రామగుండం ఎన్టీపీసీలో ఓ మహిళ బలవన్మరణం చిన్నారులు నానమ్మతో జైలుకు వెళ్లేందుకు కారణమైంది. రామగుండం ఎన్టీపీసీకి చెందిన రామలింగేశ్వరావు,సునీత దంపతుల కుమారుడు రామోజీరావుకు కృష్ణా జిల్లా  మైలవరంకు చెందిన కళ్యాణితో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. కళ్యాణికి అమ్మానాన్నలు లేకపోవడంతో మేనమామలు వివాహం చేశారు.

వీరికి యోగేంద్రవర్మ, బాలాదిత్య ఇద్దరు కుమారులున్నారు. ఈ నెల 1న కల్యాణి ఆత్మహత్య చేసుకుంది. అత్త, మామల ఇబ్బందులు ఆత్మహత్యకు కారణమని ఆమె లేఖ రాసింది.  కల్యాణి మరణవార్తను తెలుసుకున్న బంధువులు భర్త, అత్త,మామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై సాగర్‌ కళ్యాణి భర్త రామోజీరావుతో పాటు అత్త సునీత, మామ రాంలింగేశ్వరావులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.  చిన్నారులను చేరదీసేందుకు కళ్యాణి బంధువులు వెనుకాడటంతో  చిన్నారులు సైతం నానమ్మతో జైలుకు వెళ్లక తప్పలేదు.

Advertisement
 
Advertisement
Advertisement