పందుల దాడిలో చిన్నారికి గాయాలు | child injured in pigs attack | Sakshi
Sakshi News home page

పందుల దాడిలో చిన్నారికి గాయాలు

May 11 2017 11:56 PM | Updated on Sep 5 2017 10:56 AM

కౌతాళానికి చెందిన నరసయ్య, ఎలమ్మ దంపతుల కుమారుడు చరణ్‌ (3) పందుల దాడిలో గాయపడ్డాడు.

కౌతాళం : కౌతాళానికి చెందిన నరసయ్య, ఎలమ్మ దంపతుల కుమారుడు చరణ్‌ (3) పందుల దాడిలో  గాయపడ్డాడు. గురువారం ఉదయం తల్లిదండ్రులు ఇంటి పనిలో నిమగ్నం కాగా,  ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై పందులు దాడి చేశాయి. గాయపడిన బాలుడిని స్థానిక పీహెచ్‌సీలో ప్రాథమిక చేయించి ఆదోనికి తరలించారు. కౌతాళంలో పందుల బెడద అధికంగా ఉందని ఫిర్యాదు చేసినా పంచాయతీ సిబ్బంది, అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా కాలనీవాసులు విమర్శిస్తున్నారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement