జంగారెడ్డిగూడెం రూరల్ : నీటి తొట్టెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన దుర్ఘటన జంగారెడ్డిగూడెంలో సోమవారం చోటుచేసుకుంది.
నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి
Aug 30 2016 1:17 AM | Updated on Apr 3 2019 7:53 PM
జంగారెడ్డిగూడెం రూరల్ : నీటి తొట్టెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన దుర్ఘటన జంగారెడ్డిగూడెంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని శ్రీనివాసపురం గ్రామానికి చెందిన దమ్మిసెల్లి అశోక్ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. సోమవారం తన భార్య ప్రశాంతి, కుమార్తె లీలారాణి (2)తో కలిసి జంగారెడ్డిగూడెంలో బంధువుల ఇంటివద్ద జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇక్కడ చిన్నారి లీలారాణి ఆడుకుంటూ నీళ్లతొట్టెలో పడిపోయింది. బయటకు తీసేసరికి అప్పటికే మృతి చెందింది.
Advertisement
Advertisement