అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: చెవిరెడ్డి | chevireddy bhaskar reddy takes on chittoor district police | Sakshi
Sakshi News home page

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: చెవిరెడ్డి

Jul 7 2016 5:35 PM | Updated on Aug 13 2018 4:11 PM

అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని చంద్రగిరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్పష్టం చేశారు.

తిరుపతి: అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని చంద్రగిరి ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం తిరుపతి గ్రామీణ మండలం పేరూరు గ్రామంలోని రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తోన్నారని ఆరోపించారు. 

ఎనిమిదేళ్లుగా ఆస్తిపన్ను, కరెంటు బిల్లులు కడున్నారని... అలాంటి పేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేందుకు కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. బాధితుడి పక్షాన వెళ్లినందుకు నన్ను అరెస్ట్ చేస్తారా ? అని పోలీసులపై చెవిరెడ్డి భాస్కరరెడ్డి మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement