ఆరోపణలు అవాస్తవం | Charges not truth | Sakshi
Sakshi News home page

ఆరోపణలు అవాస్తవం

Dec 3 2016 11:51 PM | Updated on May 25 2018 5:52 PM

ఆరోపణలు అవాస్తవం - Sakshi

ఆరోపణలు అవాస్తవం

తనపై ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ అన్నారు.

ఆత్మకూరు: తనపై ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ అన్నారు. శనివారం ‘కాసులు వద్దు..కానుక ముద్దు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. కథనంలో ఎక్కడా ఆత్మకూరు డీఎస్పీ అని లేకపోయినప్పటికీ ఆమె స్పందించడం గమనార్హం. పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ దాదాపు రెండేళ్లుగా తాను ఇక్కడ పని చేస్తున్నానని, ఎప్పుడూ ఎలాంటి పొరపాట్లు చేయలేదన్నారు. స్టార్‌ గోదాం విషయంలో సీఐ ద్వారా డబ్బు తీసుకోలేదని.. అతను తప్పు చేసినందున తాను రిపోర్టు ఇవ్వడం వల్లే సస్పెండ్‌ అయ్యాడన్నారు. ఆత్మకూరులో తాను ఏనాడు షాపింగ్‌ చేయలేదని.. తన వద్ద ఉన్నదీ ఒక్క సెల్‌ఫోన్‌ మాత్రమేనన్నారు. పుట్టిన రోజున కానుక రూపంలో ఓ ఎస్‌ఐ రింగ్‌ ఇస్తే.. గొలుసు తీసుకురమ్మని చెప్పాననడంలోనే నిజం లేదన్నారు. అసలు ఎవరికీ తన పుట్టిన తేదీ కూడా తెలియదన్నారు. అనంతరం ఆమె తన పరిధిలోని ఎస్‌ఐలతో మాట్లాడించారు. విలేకరుల సమావేశంలో మిడుతూరు, ఆత్మకూరు, వెలుగోడు, కొత్తపల్లి, నందికొట్కూరు, పగిడ్యాల ఎస్‌ఐలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement