యూనివర్సిటీ ఏర్పాటుపై మాటమార్చిన కేసీఆర్ | Change the word of the formation of the University KCR | Sakshi
Sakshi News home page

యూనివర్సిటీ ఏర్పాటుపై మాటమార్చిన కేసీఆర్

Feb 13 2016 3:34 AM | Updated on Mar 18 2019 9:02 PM

యూనివర్సిటీ ఏర్పాటుపై మాటమార్చిన కేసీఆర్ - Sakshi

యూనివర్సిటీ ఏర్పాటుపై మాటమార్చిన కేసీఆర్

గతంలో జోడాఘాట్‌లో కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన యూనివర్సిటీ...........

 మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దుర్గాభవాని
ఇచ్చోడ : గతంలో జోడాఘాట్‌లో కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన యూనివర్సిటీ ఇక్కడే ఏర్పాటు చేస్తామని ప్రకటించి మాట మార్చారని కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుర్గాభావాని విమర్శించారు. శుక్రవారం స్థానిక మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. అత్యధికంగా ఆదివాసీలున్న జిల్లాలో కాకుండా, ఆదివాసీలు లేని వరంగల్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి జిల్లా ప్రజలను కేసీఆర్ మోసం చేశారని అన్నారు. ఎంతో వెనుబడిన ఆదిలాబాద్ జిల్లాలో కాకుండా అభివృద్ధి చెందిన వరంగల్ జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ డెరైక్టర్ కుంర కోటేశ్వర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు భగ్నూరె మాధవ్‌పటేల్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కల్లెం నారాయణరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement