కల్వకుర్తికి అన్యాయంపై పోరాటం | challa vamshichand reddy fired on trs government | Sakshi
Sakshi News home page

కల్వకుర్తికి అన్యాయంపై పోరాటం

Dec 25 2016 2:26 AM | Updated on Sep 4 2017 11:31 PM

కల్వకుర్తికి అన్యాయంపై పోరాటం

కల్వకుర్తికి అన్యాయంపై పోరాటం

కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా నీరందించడంలో నిర్లక్ష్యం చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌ రెడ్డి హెచ్చరించారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌ రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా నీరందించడంలో నిర్లక్ష్యం చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌ రెడ్డి హెచ్చరించారు. అసెంబ్లీ ఆవరణలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హయాంలోనే కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పునాదులు పడ్డాయని, దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా జూలై 2016 నాటికే సాగునీటిని అందిస్తామని టీఆర్‌ఎస్‌ హామీ కూడా ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ హామీని నిలబెట్టుకోలేని అసమర్థ టీఆర్‌ఎస్‌ నేతలు నియోజకవర్గ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement