దుర్గమ్మను దర్శించుకున్న చైనా బృందం | chaina team visits durga temple | Sakshi
Sakshi News home page

దుర్గమ్మను దర్శించుకున్న చైనా బృందం

Dec 18 2016 10:52 PM | Updated on Jul 29 2019 6:07 PM

దుర్గమ్మను దర్శించుకున్న చైనా బృందం - Sakshi

దుర్గమ్మను దర్శించుకున్న చైనా బృందం

శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్లను చైనా బృందం సభ్యులు ఆదివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు మేళతాళాలు, మంగళవాయిద్యాలతో సాదర స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వదించగా, ఆలయ ఈవో సూర్యకుమారి అమ్మవారి ప్రసాదాలను అందచేశారు.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్లను చైనా బృందం సభ్యులు ఆదివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు మేళతాళాలు, మంగళవాయిద్యాలతో సాదర స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వదించగా, ఆలయ ఈవో సూర్యకుమారి అమ్మవారి ప్రసాదాలను అందచేశారు. అనంతరం మల్లేశ్వరాలయం , చండీయాగం విశేషాలు, అమ్మవారి ప్రసాదాల గురించి చైనా బృందానికి ఈవో సూర్యకుమారి వివరించారు. చైనా బృందం అమ్మవారి ఆలయ పరిసరాలను పరిశీలిస్తుండటంపై భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement