'ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదు' | central minister prakash javadekar comments on ap special status | Sakshi
Sakshi News home page

'ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదు'

Jun 6 2016 8:23 PM | Updated on Mar 23 2019 9:10 PM

'ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదు' - Sakshi

'ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదు'

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదని కేంద్ర పర్యావరణ, సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదని కేంద్ర పర్యావరణ, సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. అనంతపురం జిల్లాలో సోమవారం ఆయన పర్యటించారు.

ఈ సందర్భంగా జవదేకర్ మాట్లాడుతూ...ఏపీ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. ఏపీ ప్రాజెక్టులకు త్వరితగతిన పర్యావరణ అనుమతులు ఇస్తున్నామన్నారు. యూపీఏ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని.. ఎన్డీఏ హయాంలో బొగ్గు కేటాయింపులు పారదర్శకంగా కేటాయిస్తున్నామని జవదేకర్ చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement