తెలంగాణ గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను గురువారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు.
సూర్యాపేట : తెలంగాణ గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను గురువారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గౌడ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు భూపతి నారాయణగౌడ్, నియోజకవర్గ కన్వీనర్ దేశగాని శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గౌడ సంఘం నాయకులు మాట్లాడారు. జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలన్నారు. అనంతరం సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా యూత్ అధ్యక్షుడు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, బైరు వెంకన్నగౌడ్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, శనగాని రాంబాబుగౌడ్, యూత్ కాంగ్రెస్ అ««ధ్యక్షులు బైరు శైలెందర్‌గౌడ్, నేరెళ్ల మధుగౌడ్, సత్యనారాయణ, టైసన్ శ్రీను, పల్సా వెంకన్న, రవి, రాపర్తి శ్రీనివాస్‌గౌడ్, బెల్లంకొండ రాంమూర్తిగౌడ్, పొలగాని బాలుగౌడ్, వెంకటనారాయణ, చీకూరి ప్రకాష్‌గౌడ్, వేణు, భూపతి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.