కారు బోల్తా.. నలుగురికి తీవ్రగాయాలు | car accident in nalgonda district | Sakshi
Sakshi News home page

కారు బోల్తా.. నలుగురికి తీవ్రగాయాలు

Jan 7 2016 8:28 AM | Updated on Sep 3 2017 3:16 PM

వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

చింతపల్లి: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రం సమీపంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు చింతపల్లి సమీపంలోకి చేరుకోగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురికి తవ్రగాయాలు కాగా.. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement