చిల్లర రాజకీయాలు మానుకోవాలి | BV raghavulu comments on government | Sakshi
Sakshi News home page

చిల్లర రాజకీయాలు మానుకోవాలి

Apr 27 2016 4:13 AM | Updated on Nov 9 2018 5:56 PM

చిల్లర రాజకీయాలు మానుకోవాలి - Sakshi

చిల్లర రాజకీయాలు మానుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం చిల్లర రాజకీయాలు మానుకొని ప్రజాసమస్యలపై దృష్టి పెట్టాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పేర్కొన్నారు.

సర్కార్‌కు బీవీ రాఘవులు హితబోధ

 సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం చిల్లర రాజకీయాలు మానుకొని ప్రజాసమస్యలపై దృష్టి పెట్టాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పేర్కొన్నారు. మంగళవారం సీపీఎం చేపట్టిన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడిలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరువు పరిస్థితులతో జనం ఎదుర్కొంటున్న సమస్యల్ని సత్వరం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కరువుతో రైతులు నష్టపోయారని, వారికి ఇన్‌పుట్ రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జేసీ రజత్‌కుమార్ సైనీకి వినతిపత్రం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement