బస్సు బోల్తా: ఐదుగురికి గాయాలు | bus accident, five injured | Sakshi
Sakshi News home page

బస్సు బోల్తా: ఐదుగురికి గాయాలు

Mar 30 2016 8:14 AM | Updated on Apr 3 2019 7:53 PM

వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం ఏకోపల్లె సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి.

దువ్వూరు: వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం ఏకోపల్లె సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి. కర్నూలు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి కర్నూలు వైపు వెళ్తుండగా.. ఉదయం ఐదుగంటల సమయంలో ఏకోపల్లె సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులోని ఐదుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement