బుల్లెట్ రూ. 2లక్షలు.. నంబరుకు రూ. 4.51 లక్షలు | Bullet @ Rs. 2 lakhs, number @ Rs. 4.51 lakhs | Sakshi
Sakshi News home page

బుల్లెట్ రూ. 2లక్షలు.. నంబరుకు రూ. 4.51 లక్షలు

May 6 2016 4:29 PM | Updated on Sep 3 2017 11:32 PM

బుల్లెట్ రూ. 2లక్షలు.. నంబరుకు రూ. 4.51 లక్షలు

బుల్లెట్ రూ. 2లక్షలు.. నంబరుకు రూ. 4.51 లక్షలు

వాహనదారులకు ఫ్యాన్సీ నంబర్లపై క్రేజ్ రోజు రోజుకూ పెరిగిపోతోంది.

నూజివీడు : వాహనదారులకు ఫ్యాన్సీ నంబర్లపై క్రేజ్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. రేటు ఎక్కువైనా సరే ఇష్టమైన నంబర్లను దక్కించుకుని అందరి దృష్టిని తమవైపు తిప్పుకొంటున్నారు. ఫ్యాన్సీ నంబర్లను స్టేటస్ సింబల్‌గా భావిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం కూడా దండిగానే వస్తోంది. నూజివీడులోని రవాణా యూనిట్ కార్యాలయంలో ఏపీ 16డీజీ 6666 నంబరుకు గురువారం బిడ్డింగ్ జరగ్గా రూ.4,51,832కు పట్టణ పరిధిలోని గొడుగువారిగూడేనికి చెందిన ఆకుల వెంకటరాజు దక్కించుకున్నారు.
 
 నంబరుకే ఇంత ధర పెడితే.. అదేదో ఆడి కారు అనుకోవడానికి లేదు.. బుల్లెట్ కోసం ఆయన ఈ నంబరు తీసుకున్నారు. 500 సీసీ బుల్లెట్ ధర రూ.2లక్షలు కాగా, నంబరుకే ఆయన రూ.4.51 లక్షలు కేటాయించడం ఆశ్చర్యమే. ఇదే నంబరు కోసం నూజివీడుకు చెందిన బి.వేణుగోపాలరావు రూ.2,65,750కు, బాపులపాడు మండలం మడిచర్లకు చెందిన సీహెచ్ అహల్య రూ.1.23లక్షలకు బిడ్ వేశారు. నూజివీడు రవాణా యూనిట్ కార్యాలయం చరిత్రలో అత్యధిక ధర పలికిన నంబరు ఇదే.              
 
 

Advertisement
 
Advertisement
Advertisement