సాక్షి హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తి దగ్గర బుల్లెట్ ఉండడం తీవ్రకలకలం రేపింది. తిరుపతి నుంచి వచ్చిన ఓ వ్యక్తి లగేజ్‌ని భద్రతా అధికారులు తనిఖి చేయగా అతని వద్ద బుల్లెట్ ఉండడం గమనించారు. దీంతో అక్కడే ఉన్న సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఆ బుల్లెట్‌ని స్వాధీనం చేసుకొని ఆ ప్రయాణికున్ని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆబుల్లెట్ నుంచి వచ్చిందా? అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు.


