రూ. 49కే బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ ఫోన్‌ | bsnl offer | Sakshi
Sakshi News home page

రూ. 49కే బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ ఫోన్‌

Aug 23 2016 6:34 PM | Updated on Sep 4 2017 10:33 AM

రూ. 49కే బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ ఫోన్‌

రూ. 49కే బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ ఫోన్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు ఎక్స్‌పీరియన్స్‌ ఎల్‌ఎల్‌ 49 పేరుతో కేవలం రూ.49కే ల్యాండ్‌ఫొన్‌ అందిస్తోందని డీజీఎంలు రాంబాబు, నర్సయ్య, రాజేంద్రనాథ్‌ తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ కరీంనగర్‌ కార్యాలయంలో మంగళవారం వివరాలు వెల్లడించారు. ల్యాండ్‌ఫోన్‌ కొత్తప్లాన్‌లో మొదటి 6 నెలలకు కేవలం రూ.49 లకు అందిస్తున్నామని తెలిపారు.

  • నేడు జిల్లా వ్యాప్తంగా ఉచిత సిమ్‌ మేళా
  • కరీంనగర్‌ క్రై ం :  బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులకు ఎక్స్‌పీరియన్స్‌ ఎల్‌ఎల్‌ 49 పేరుతో కేవలం రూ.49కే ల్యాండ్‌ఫొన్‌ అందిస్తోందని డీజీఎంలు రాంబాబు, నర్సయ్య, రాజేంద్రనాథ్‌ తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ కరీంనగర్‌ కార్యాలయంలో మంగళవారం వివరాలు వెల్లడించారు. ల్యాండ్‌ఫోన్‌ కొత్తప్లాన్‌లో మొదటి 6 నెలలకు కేవలం రూ.49 లకు అందిస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి అన్ని ల్యాండ్‌ఫోన్లకు అదివారం 24 గంటల పాటు, మిగతా రోజుల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అన్‌లిమిటెడ్‌గా మాట్లాడుకోవచ్చని పేర్కొన్నారు. ఈనెల 1వ తేదీ నుంచి బ్రాండ్‌ బ్యాండ్‌ స్పీడ్‌ 512 కేబీపీఎస్‌ నుంచి 1 ఎంబీపీఎస్‌కు పెంచామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 2జీ టవర్లు 315, 3జీ టవర్లు 104 ఉన్నాయని కొత్తగా చిన్నకాపువరం, వీణవంక, పైడిమడుగులో 3జీ టవర్లు ఏర్పాటు చేశామని వివరించారు. జిల్లాలో 20 వేల ల్యాండ్‌ఫోన్‌ కనెక్షన్లు, 3.50 లక్షల ప్రీపెయిడ్, 22 వేల మంది పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులున్నారని తెలిపారు. వినియోగదారుల కోసం బుధవారం జిల్లా వ్యాప్తంగా ఉచిత సిమ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరికీ బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలందించేందుకు పలు ప్లాన్లు అమలు చేస్తున్నామని బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు సర్వీసుల్లో ఇబ్బందులు పడితే నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 
     
     
     
     
     

Advertisement
 
Advertisement
Advertisement