బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆధ్వర్యంలో నేడు మెగా మేళా | BSNL mega mela on 25th july | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆధ్వర్యంలో నేడు మెగా మేళా

Jul 24 2016 9:24 PM | Updated on Oct 16 2018 3:12 PM

సోమవారం బీఎస్‌ఎన్‌ఎల్‌ మెగా మేళా నిర్వహించనున్నారు. బీఎస్‌ఎన్‌ సెల్‌ఫోన్‌ వినియోగదారులకు ఉచితంగా సిమ్‌కార్డులు అందజేయనున్నారు.

సాక్షి, సంగారెడ్డి : బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆధ్వర్యంలో నేడు(సోమవారం) మెగా మేళా నిర్వహించనున్నారు. బీఎస్‌ఎన్‌ వినియోగదారులకు ఉచితంగా  సిమ్‌కార్డులు అందజేయనున్నారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, పటాన్‌చెరు, జహీరాబాద్, జోగిపేట, గజ్వేల్, నారాయణఖేడ్, నర్సాపూర్, మండల కేంద్రాల్లో ఈ మేళా నిర్వహించనున్నారు.

మేళాలో వినియోగదారులకు ఉచితంగా సిమ్‌కార్డులు అందజేసి ఒకేరోజులో యాక్టివేట్‌ చేస్తామని బీఎస్‌ఎన్‌ఎల్‌ జీఎం ఏకే సాహూ తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రీపెయిడ్‌లో విద్యార్థులు కోసం  స్టూడెంట్‌ స్పెషల్‌ ప్లాన్‌, ఇతరుల కోసం అముల్య ప్లాన్‌ అందుబాటులో ఉంచామన్నారు.

స్టూడెంట్‌ స్పెషల్‌ ప్లాన్‌లో 30 రోజుల వరకు 1 జీబీ డాటా ఉచితంగా అందజేయటంతో పాటు ప్రతి నిమిషానికి 20 పైసలు, బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులతో మాట్లాడితే ప్రతినిమిషానికి పది పైసలు చార్జి ఉంటుందన్నారు. అలాగే ఎస్‌ఎంఎస్‌ 15 పైసలు ఉంటుందన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement