పూర్తికాని వంతెనలతో ప్రజలకు అవస్థలు | Sakshi
Sakshi News home page

పూర్తికాని వంతెనలతో ప్రజలకు అవస్థలు

Published Thu, Jul 13 2017 12:51 AM

పూర్తికాని వంతెనలతో ప్రజలకు అవస్థలు - Sakshi

తణుకు టౌ¯ŒS : 
జిల్లాలో యనమదుర్రు డ్రెయి¯ŒSపై చేపట్టిన వంతెనల పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో డ్రెయి¯ŒSకు ఇరువైపులా ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రెయి¯ŒSకు ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలకు దగ్గరి మార్గంగా ఉంటుందనే ఉద్దేశంతో రూ.24 కోట్లతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో చేపట్టిన ఈ వంతెనల నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. జిల్లాలో ఎగువ ప్రాంతాల నుంచి తీర ప్రాంతానికి మురుగునీరు ప్రవహించే యనమదుర్రు డ్రెయి¯ŒSపై ఎనిమిది చోట్ల  వంతెనలు నిర్మించారు. వీటిలో ఉండ్రాజవరం మండలం పసలపూడి, తణుకు మండలం దువ్వ, పెంటపాడు మండలం బి కొందేపాడు, గణపవరం మండలం ఎస్‌ కొందేపాడు, భీమవరం, గొల్లవానితిప్ప, తోకతిప్ప గ్రామాల్లో రూ.24 కోట్లతో 2007–08 సంవత్సరంలో వీటి నిర్మాణం చేపట్టారు. వీటన్నింటినీ ఒకే ప్యాకేజీగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఐవీఆర్‌సీఎల్‌ చేపట్టింది. 
 
నిర్మాణాల్లో లోపాలు
ఈ వారధుల నిర్మాణాల్లో లోపాలు ఉన్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.. ముఖ్యంగా పసలపూడి గ్రామంలో నిర్మించిన వంతెన మధ్యలో ఒక స్పా¯ŒSలో లోపాలు ఉన్నట్టు గుర్తించినట్టు స్థానిక రైతులు చెప్పారు.  ఈ కారణంగానే ఈవంతెన నిర్మాణం నిలిచిపోయిందని తెలి పారు. దీంతో పాటు యనమదుర్రు డ్రెయి¯ŒS ఉధృతిని తట్టుకునే విధంగా గట్లను పటిష్టం చేసి డ్రెయి¯ŒS వెడల్పు చేసేందుకు రైతుల భూములను కూడా డ్రెయి¯ŒSలో విలీనం చేసి మరీ గట్లను పటిష్టం చేశారు. అయితే మిగిలి పోయిన వంతెన పనులను మాత్రం పూర్తి చేయలేదని రైతులు ఆరోపిస్తున్నారు. దువ్వలో నిర్మించిన వంతెనకు ఇరువైపులా అప్రోచ్‌ రోడ్డు నిర్మించాల్సి ఉంది. మధ్యలో ఆగిపోయిన వంతెనలకు అప్రోచ్‌ రోడ్డులు నిర్మించిస్తే యనమదుర్రు డ్రెయి¯ŒSకు ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ఆయా గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. 
 
తగ్గనున్న దూరం
ఈవంతెనలను అందుబాటులోకి తెస్తే జిల్లాలోని పలు గ్రామాల మధ్య దూరం తగ్గుతుంది. పసలపూడి వంతెన పూర్తయితే తణుకు, నిడదవోలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల ప్రజలకు.. దువ్వ గ్రామంలోని వంతెన పూర్తయితే తణుకు, తాడేపల్లిగూడెం, పెంటపాడు, అత్తిలి, గణపవరం, మండలాల్లోని గ్రామాల ప్రజలకు.. బీ కొందేపాడు, ఎస్‌ కొందేపాడు వంతెనల నిర్మాణాల ద్వారా గణపవరం, అత్తిలి, ఉండి మండలాల రైతులకు మేలు చేకూరుతుంది. భీమవరంలో నిర్మించే వంతెనతో పట్టణంలోని ట్రాఫిక్‌ సమస్య తీరుతుంది. ఈ వంతెనల నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయా.. అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
 

Advertisement
Advertisement