అక్టోబర్‌ 2 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు | brahmothsavalu october 2nd onwards | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 2 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Sep 29 2016 7:08 PM | Updated on Sep 4 2017 3:31 PM

కల్యాణ వేంకటేశ్వర స్వామి విగ్రహాలు

కల్యాణ వేంకటేశ్వర స్వామి విగ్రహాలు

మండలంలోని గుమ్మడిదల గ్రామంలో గల కల్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహోత్సవాలను వచ్చే నెల 2 నుంచి నిర్వహించనున్నారు.

జిన్నారం: మండలంలోని గుమ్మడిదల గ్రామంలో గల కల్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహోత్సవాలను వచ్చే నెల 2 నుంచి నిర్వహించనున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తల ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు స్వామివారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఉత్సవాలకు సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను కూడ అర్చకులు ఆవిష్కరించారు. ఉత్సవాల నిర్వహణకు ఇప్పటికే   అన్ని ఏర్పాట్లు చేశారు.

ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున స్వస్తి వాచనం, 3న ధ్వజారోహణం, శేషవాహనం, 4న స్వామివారి అభిషేకం, గజవాహన సేవ, 5న కల్యాణోత్సవం, హనుమంత వాహన సేవ, 6న సదస్వం, గరుడవాహన సేవ, 7న మహాపూర్ణాహుతి, అశ్వవాహన సేవ కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆలయ వంశపారం పర్య ధర్మకర్తలు సుందరాచార్యులు, నర్సింహ్మాచార్యులు తెలిపారు. స్వామివారి బ్రహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. స్వామివారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించటంలో తాము కూడా భాగస్వాములవుతామని సర్పంచ్‌ సురేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ నరేందర్‌రెడ్డిలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement