నెల్లూరు(అర్బన్) : నెల్లూరులోని పెద్దాస్పత్రి (డీఎస్సార్)కి మానవ హక్కుల కమిషన్ నుంచి నోటీసులు అందాయి.
పెద్దాస్పత్రికి మానవ హక్కుల కమిషన్ నోటీసులు
Jul 27 2016 12:20 AM | Updated on Oct 20 2018 6:19 PM
నెల్లూరు(అర్బన్) : నెల్లూరులోని పెద్దాస్పత్రి (డీఎస్సార్)కి మానవ హక్కుల కమిషన్ నుంచి నోటీసులు అందాయి. ఆస్పత్రిలో వైద్యసేవలు సరిగా అందడంలేదని, కనీస వసతులులేవని తదితర అంశాలపై పలు పత్రికల్లో వచ్చిన కథనాలను పరిగణలోకి తీసుకున్న కమిషన్ నోటీసులు జారీచేసింది. దీనిపై ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ మంగళవారం మాట్లాడుతూ ఆస్పత్రిలో అందుతున్న సేవలు గురించి నివేదిక తయారుచేసి పంపుతున్నామని చెప్పారు. కనీస వసతులు, డాక్టర్ల హాజరు తదితర అంశాల గురించి మానవహక్కుల కమిషన్ వివరాలు అడిగిందని తెలియజేశారు.
Advertisement
Advertisement