బోనమెత్తిన హిజ్రాలు | bonala jathara in srisailam | Sakshi
Sakshi News home page

బోనమెత్తిన హిజ్రాలు

Aug 9 2015 8:45 PM | Updated on Sep 27 2018 5:46 PM

బోనమెత్తిన హిజ్రాలు - Sakshi

బోనమెత్తిన హిజ్రాలు

తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ వైభవంగా జరుగుతుండగా, ఆంధ్ర విజయవాడకు చెందిన హిజ్రాలు శ్రీశైల భ్రమరాంబకు బోనాలను సమర్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పండుగ చేసుకున్నారు.

శ్రీశైలం: తెలంగాణలో బోనాల పండుగ వైభవంగా జరుగుతోంది. అయితే అంతే ఘనంగా జరపాలనుకున్నారు ఈ హిజ్రాలు. అందుకే ఆదివారం విజయవాడకు చెందిన కొంతమంది కలిసి శ్రీశైల భ్రమరాంబకు బోనాలను సమర్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పండుగ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శ్రీశైలంలోని గంగాధర మండపం వద్ద ఒక హిజ్రా బోనం తలపై పెట్టుకుని రాగా.. మరో ముగ్గురు హిజ్రాలు ఆటపాటలతో నృత్యాలు చేసుకుంటూ అమ్మవారి ఆలయానికి వెళ్లి బోనాలను సమర్పించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement