‘కేఎస్‌రెడ్డి’ పాఠశాలలో బోనాల పండుగ | Sakshi
Sakshi News home page

‘కేఎస్‌రెడ్డి’ పాఠశాలలో బోనాల పండుగ

Published Mon, Aug 1 2016 10:34 PM

‘కేఎస్‌రెడ్డి’ పాఠశాలలో బోనాల పండుగ - Sakshi

సూర్యాపేటమున్సిపాలిటీ : పట్టణంలోని విద్యానగర్‌లో గల కేఎస్‌రెడ్డి మోడల్‌ స్కూల్‌లో సోమవారం విద్యార్థులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రత్యేకంగా బోనాలను తయారు చేసి పాఠశాల నుంచి  తెలంగాణ తల్లి విగ్రహం వరకు ఆటపాటలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు సాంప్రదాయాలను తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement