లారీ ఢీకొని ఇద్దరు వ్యక్తుల మృతి | Bike hits Lorry, two died | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని ఇద్దరు వ్యక్తుల మృతి

May 17 2016 2:08 PM | Updated on Apr 3 2019 7:53 PM

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు

నాయుడుపేట: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. పెళ్లకూరు మండలం పెన్నేపల్లికి చెందిన కొవ్వూరు ఏడుకొండలు(43), చిట్టమూరు మండలం జునపాటిపాలెం గ్రామానికి చెందిన దుక్కలూరి మనోజ్(16) నాయుడుపేటలోని మంజీరా వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి పని ముగించుకుని బైక్‌పై పెన్నేపల్లికి బయలుదేరారు. వారి వాహనాన్ని ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఏడుకొండలు అక్కడికక్కడే చనిపోగా, తీవ్రగాయాలపాలైన మనోజ్ మంగళవారం మధ్యాహ్నం ఆస్పత్రిలో కన్నుమూశాడు.

Advertisement
 
Advertisement
Advertisement