breaking news
edukondalu
-
పోలీసులు చితకబాదడం వల్లే నా తమ్ముడు చనిపోయాడు
చంద్రబాబు కర్కశ పాలనలో ఖాకీలు కాలాంతకుల్లా మారుతున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన పోలీసుస్టేషన్లు బడుగుజీవుల బలికోరే వధశాలలవుతున్నాయి. ఇటీవల విజయవాడ నగరంలో పోలీసుల అధికారమదానికి బలైన కాపు యువకుడు సాయికృష్ణ, దళిత యువకుడు క్రాంతికుమార్ మరణాలను మరిచిపోకముందే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు ఎస్సై దాష్టీకానికి మరో దళిత యువకుడు ఏడుకొండలు, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సీఐ వేధింపులకు మైనార్టీ ఉద్యోగి దరియా హుసేన్ అసువులుబాశారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో ఖాకీలు మోగిస్తున్న ఈ మరణ మృదంగం రాష్ట్రంలో బాబు సర్కారు సాగిస్తున్న రెడ్‌బుక్ నరమేధానికి సజీవసాక్ష్యమై నిలుస్తోంది. రక్షణ చట్టాలకు ఉరితాడు బిగించి వికటాట్టహాసం చేస్తోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్‌స్టేషన్ ఎస్సై ఎస్కే హనీఫ్ ఖాకీ దుస్తులు ధరించిన క్రిమినల్ మాదిరిగా అరాచకంగా వ్యవహరిస్తున్నాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన వ్యవహార శైలి అత్యంత వివాదాస్పదంగా ఉందని చర్చించుకుంటున్నారు. తప్పు చేస్తే నిందితులను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పర్చాల్సిన ఎస్సై.. నిందితులను, అమాయకులను చచ్చే వరకు కొడుతున్నాడని పేర్కొంటున్నారు. ఆయన అరాచకాలకు ఎన్నో ఉదంతాలున్నాయని స్పష్టం చేస్తున్నారు. బదిలీపై వచ్చి.. ఈ ఏడాది మే 9వ తేదీన పొదలకూరు మండలం నావూరుపల్లికి చెందిన గాలం హరికృష్ణ అనే రైతును టీడీపీ నేతల ఆదేశాల మేరకు అకారణంగా స్టేషన్‌కు తీసుకొచ్చి లాఠీలతో చితకబాదాడు. ఈ సన్నివేశాలను వీడియో కాల్ ద్వారా టీడీపీ నేతలకు లైవ్‌లో చూపించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. గూడూరు ఇన్చార్జి డీఎస్పీ దీనిపై విచారించి కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఎట్టకేలకు ఈ నెల మొదటి వారంలో ఆ ఎస్సైను మనుబోలు పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయడంతో 6వ తేదీన బాధ్యతలు చేపట్టారు. చోరీ కేసులో పైశాచికత్వం బంగారం చోరీ కేసులో మనుబోలు మండలం చెరుకుమూడికి చెందిన బొల్లు ఏడుకొండలతోపాటు మరో ఇద్దరిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై హనీఫ్, కానిస్టేబుళ్లు రెండు రోజుల పాటు స్టేషన్లో వారిని లాఠీలతో కుళ్ల బొడిచారు. ఈ క్రమంలో వారిని ఆదివారం రాత్రి వదిలేసి.. మర్నాడు రావాలంటూ హెచ్చరించారు. సోమవారం ఇద్దరు మాత్రమే స్టేషన్‌కు రాగా ఏడుకొండలు రాలేదు. దీంతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాధవరావు, మరో కానిస్టేబుల్ కారులో ఏడుకొండలు ఉన్న గ్రామానికి చేరుకుని విచక్షణారహితంగా కొట్టారు. సొమ్మసిల్లి పడిపోయిన ఏడుకొండలను కారు డిక్కీలో కుక్కి స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్పృహలో లేకపోవడంతో నీళ్లు చల్లి మరీ చావబాదినట్లు సమాచారం. సాయంత్రం 6 గంటలకు ఏడుకొండలును గూడూరు ఏరియా వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చోరీ కేసులో కొట్టి చంపొచ్చా..? చోరీ కేసులో నిందితుడు ఏడుకొండలును అదుపులోకి తీసుకున్న మనుబోలు పోలీసులు విచారణ అనంతరం కోర్టులో హాజరు పరచాలి. కానీ ఏడుకొండలతోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని రెండు రోజుల పాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. నాలుగు సవర్ల బంగారం పోయిందని కేసు నమోదైతే.. నిందితులను కొట్టి, హింసించి 12 సవర్ల బంగారాన్ని తీసుకున్నారు. వారి నుంచి బంగారం కొనుగోలు చేసిన వారిని బెదిరించి కేసులు పెడతామని మరో 12 సవర్ల బంగారాన్ని తీసుకున్నారు. చివరకు 2 సవర్లు మాత్రమే రికవరీ చూపించారు. నిందితులను కోర్టుకు హాజరుపర్చకుండా స్టేషన్‌కు తరలించి చావబాదడం వల్లే ఏడుకొండలు చనిపోయాడని స్పష్టమవుతోంది. ఎస్పీ అజిత బుధవారం మీడియాతో మాట్లాడుతూ అది లాకప్ డెత్ కాదన్నారు. మరి ఎలా చనిపోయాడనే ప్రశ్నకు పోలీసుల దగ్గర సమాధానం లేదు. కొట్టి చంపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? మనుబోలు పోలీస్‌స్టేషన్ వద్ద ఏడుకొండలు మృతదేహంతో ఆందోళనకు దిగిన కాకాణి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ గడ్డి మందు తాగి చనిపోయాడంటూ.. ఏడుకొండలు మృతి చెందాడని గుర్తించిన పోలీసులు అతడి సోదరుడికి ఫోన్ చేసి మీ అన్న గడ్డి మందు తాగి పొలాల్లో చనిపోయాడని, ఆస్పత్రికి వచ్చి సంతకాలు పెట్టాలని తొలుత చెప్పారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి గడ్డి మందు తాగి ఎలా చనిపోతాడని బాధితులు స్టేషన్ ఎదుట మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. చంపేసి గడ్డి మందు తాగాడని చెబుతున్నారంటూ మండిపడ్డారు. గడ్డి మందు తాగి పొలాల్లో చనిపోతే నిబంధనల ప్రకారం స్థానిక వీఆర్వో ద్వారా ఫిర్యాదు తీసుకుని శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టంకు తరలించాలి. కానీ ఏడుకొండల విషయంలో అలాంటిదేమీ జరగలేదు. అసలు గడ్డి మందు తాగినట్లు ఆనవాళ్లు కూడా లేవు. పోలీసుల అదుపులో వ్యక్తి ఆస్పత్రిలో శవంగా తేలటాన్ని బట్టి దెబ్బలకు తాళలేకే చనిపోయాడన్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. పంచనామా రిపోర్టులో ఆ వివరాలేవి? ఏడుకొండలు మృతిపై పోలీసులు చెప్పేవన్నీ అబద్ధాలేనని శవ పంచనామా రిపోర్టే తేటతెల్లం చేస్తోంది. ఏడుకొండలును మంగళవారం సాయంత్రం 6.15 గంటలకు గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడని డ్యూటీ డాక్టర్ చెప్పినట్లు పంచనామా రిపోర్టులో పొందుపరిచారు. మృతుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పేర్కొన్నారు. పోలీసులు చెప్పినట్లు నిజంగానే గడ్డి మందు తాగి ఉంటే.. పాయిజన్ వాసన వస్తుంది. శరీరం రంగు మారడం లాంటివి జరగాలి. కానీ ఇవేవి లేవు. కానిస్టేబుల్ మాధవరావు, మడమనూరుకు చెందిన నవీన్ కలిసి ఏడుకొండలను ఆస్పత్రికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. అపస్మారక స్థితిలో ఎక్కడ ఉండగా ఆస్పత్రికి తీసుకెళ్లారనే విషయం పంచనామా రిపోర్టులో రాయలేదు. పోలీసులు మొదట చిత్రీకరించిన ప్రకారం.. గడ్డి మందు తాగి చనిపోయి ఉంటే వీఆర్వో ఫిర్యాదు లేకుండా ఎలా తరలించారు? ఎవరి ద్వారా సమాచారం లేకుండా.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా.. ప్రాథమికంగా చేపట్టాల్సిన శవ పంచనామా చేయకుండా నేరుగా ఆస్పత్రికి ఎలా తరలించారు? అనే ప్రశ్నలకు పోలీసుల వద్ద సమాధానం లేదు. -
ఏడుకొండలు భార్య షాకింగ్ నిజాలు
-
పోలీసులా.. రాక్షసులా? మరో లాకప్ డెత్..
-
సర్కారు కిరాతకంలో మరో లాకప్‌డెత్!
సాక్షి టాస్క్ ఫోర్స్: చంద్రబాబు సర్కారులో వరుస లాకప్ డెత్‌లు రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. ఇటీవల విజయవాడలో కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్, తర్వాత శవాన్ని మాయం చేయడం సర్కారు కిరాతకానికి పరాకాష్ట. తాజాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మరో లాకప్ డెత్ చోటు చేసుకుంది. బంగారు గొలుసు చోరీ కేసులో నెల్లూరు జిల్లా మనుబోలు పోలీసులు తీసుకొచ్చిన బొల్లి ఏడుకొండలు (50) మంగళవారం పోలీసు స్టేషన్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీసు దెబ్బలకే అతను చనిపోయాడని స్థానికులు అంటుండగా.., గడ్డి మందు తాగి చనిపోయాడని పోలీసులు అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ బంగారు గొలుసు దొంగతనం కేసులో చెరుకుమూడి గ్రామానికి చెందిన బొల్లి ఏడుకొండలును మనుబోలు పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో విచారించారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్‌పై విడిచి పెట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఏడుకొండలు గ్రామంలో ఉన్నాడని ఎవరో పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు చెరుకుమూడి వెళ్లి ఏడుకొండలును తిరిగి అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదినట్లు సమాచారం. దెబ్బలకు తాళలేక అతను మృతి చెందడంతో గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని చెరుకుమూడి దారిలో పడేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏడుకొండలు మృతదేహాన్ని ఎవరికీ చూపించకుండా పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఏడుకొండలు సోదరి మంగళవారం రాత్రి స్టేషన్ చేరుకుని మా తమ్ముడిని తీసుకొ చ్చి, ఏమి చేశారంటూ విలపించడం కంట తడి పెట్టించింది. కాగా, ఏడుకొండలు గడ్డి మందు తాగి చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. -
గోధుమ రంగు గుట్ట కాదు.. బంగారు గుట్ట అని పిలుస్తాం!
తిరుపతి నుంచి చెన్నై వెళ్ళే దారిలో ఒక గుట్టపైన ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారి పాదం ఉంది. స్వామివారు నారాయణవనంలో పద్మావతిని పెళ్ళాడి స్థిర నివాసం కోసం బయలుదేరాడు. దారిలో పుత్తూరు పట్టణం పక్కనున్న గుట్టమీద కాలు పెట్టాడని, అది స్వామిని మోయలేక కదిలిందని చెబుతారు. దాంతో ఆ ప్రయత్నం విరమించుకుంటాడు స్వామి. మరికొన్ని చోట్ల కూడా పాదం మోపి చివరిగా శేషాచలం కొండలపైన కొలువైనాడని భక్తుల నమ్మకం.ఆ గుట్ట మీదున్న స్వామిపాదాన్ని చూద్దామని తమిళనాడుకు చెందిన కొందరు యువతీ యువకులు జట్టుగా బయలుదేరారు. ఆ బృందానికి ఒక నాయకుడిని ఎంపిక చేసుకున్నారు. గుట్టపైకి వెళ్ళే దారి చూపడానికి ఒక స్థానికుడిని మాట్లాడుకున్నారు. నామం పెట్టుకుని, చేతిలో కర్ర, తలకి టోపీ, చలువ కళ్ళద్దాలు తొడిగి చెప్పులు లేకుండా ఆ బృందం బయలుదేరింది. గుట్ట ఎక్కుతున్న వారిని చూసి అక్కడి గ్రామాల ప్రజలు ‘ఈ పిల్లోళ్ళకి ఎంత భక్తి, ఎంత భక్తి’ అని పొగడ్తల వర్షం కురిపించారు.కొద్దిదూరం నడిచాక గుట్ట మీద ఉన్న గడ్డిని చూసి ఒక మెడికో అమ్మాయి ‘‘ఇక్కడ అంతా పచ్చగా ఉంటుందని అనుకున్నాము, కానీ ఇక్కడేమిటి, అంతా గోధుమ రంగులో ఉంది’’ అని ఆశ్చర్యంగా అడిగింది. ఆమె చూసింది పూరికప్పు వేసుకోవడానికి ఉపయోగించే బోద గడ్డి అది. ఎండకి బాగా ఎండి అది గోధుమ రంగులోకి మారి ఉంది.దారి చూపే స్థానికుడు ఆమె మాటలకు చిన్న నవ్వు నవ్వాడు. ‘‘మేము దీన్ని గోధుమ రంగు గుట్ట అని పిలవం, బంగారు గుట్ట అని పిలుస్తాం’’ అని చెప్పాడు. పక్కనే ఉన్న బృందనాయకుడు మనం ఈ గుట్టమీదున్న గడ్డిని చూసి గోధుమ రంగు గుట్ట అనుకుంటున్నాము, దాన్నే భక్తి భావంతో, ఆశావాద దృక్పథంతో ఉన్న ఇక్కడి వారు బంగారు గుట్టగా భావిస్తున్నారు. మన దృక్పథాన్ని పునః పరిశీలించుకోవాల్సి ఉందని వివరించాడు.మాటల్లోనే గుట్ట మీదకు చేరుకున్నారు. అక్కడున్న ఏనుగు పాదాలు, గుర్రపు పాదాల అడుగులు చూసి ఆశ్చర్యపోయారు. స్వామి పాదం పక్కనే ఉన్న దొనలో కాళ్ళు చేతులు కడుక్కుని పూజలు చేసి గోవిందలు పలుకుతూ వెనుదిరిగారు.దిగుతూ ఉంటే భక్తి పారవశ్యంతో ఉన్న ఆ మెడికో అమ్మాయికి గుట్ట మీదున్న గడ్డి అందంగా, బంగారు రంగులో కనిపించింది. ఏదైనా చూసే మనసును బట్టి ఉంటుంది ఈ ప్రపంచం అని తెలుసుకుంది ఆ అమ్మాయి. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
స్వయంగా బావిలోకి దిగి శవాన్ని వెలికి తీసిన ఎస్ఐ
తాండూరు రూరల్: ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ యువకుడు దుర్మరణం చెందగా.. ఎస్ఐ స్వయంగా బావిలోకి దిగి మృతదేహాన్ని వెలికి తీశారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కొత్లాపూర్‌లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్లాపూర్‌కు చెందిన రాయిపల్లి నర్సింహులు (30) హోలీ సంబరాల అనంతరం స్నానం చేసేందుకు ఓ బావి వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అతడు అందులో పడి మృతి చెందాడు. అయితే, నీరు ఎక్కువగా ఉండటం, పురాతనమైనది కావడంతో గ్రామస్తులెవరూ ఆ బావిలోకి దిగేందుకు ముందుకు రాలేదు. దీంతో కరన్‌కోట్ ఎస్ఐ ఏడుకొండలు నడుముకు తాళ్లు కట్టుకొని స్వయంగా బావిలోకి దిగి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. దీంతో గ్రామస్తులు ఎస్సైని చప్పట్లతో అభినందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. చదవండి: యూనిఫామ్‌లోనే ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య సైబర్ నేరగాళ్ళు.. పోలీసులకే టోకరా! -
కృష్ణాజిల్లాలో దారుణం...
విజయవాడ: కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం యాకమూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని తల్లి, భార్య, కుమారుడు కలిసి హతమార్చేందుకు యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికంగా నివాసం ఉంటున్న ఏడుకొండలు అనే వ్యక్తిని కుటుంబ సభ్యులంతా కలిసి బలవంతంగా పురుగుల మందు తాగించి అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు ఏడుకొండలును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే కుటుంబ సభ్యులు ఎందుకు ఈ దురగాతానికి పాల్పడ్డారనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
లారీ ఢీకొని ఇద్దరు వ్యక్తుల మృతి
నాయుడుపేట: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. పెళ్లకూరు మండలం పెన్నేపల్లికి చెందిన కొవ్వూరు ఏడుకొండలు(43), చిట్టమూరు మండలం జునపాటిపాలెం గ్రామానికి చెందిన దుక్కలూరి మనోజ్(16) నాయుడుపేటలోని మంజీరా వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి పని ముగించుకుని బైక్‌పై పెన్నేపల్లికి బయలుదేరారు. వారి వాహనాన్ని ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఏడుకొండలు అక్కడికక్కడే చనిపోగా, తీవ్రగాయాలపాలైన మనోజ్ మంగళవారం మధ్యాహ్నం ఆస్పత్రిలో కన్నుమూశాడు. -
కూతురుని లైంగికంగా వేధిస్తున్న తండ్రి
అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు విజయవాడ(అజిత్‌సింగ్‌నగర్) : కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో వడ్డెర కాలనీకి చెందిన ఏడుకొండలు అనే వ్యక్తిని నున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజీవ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన ఏడుకొండలు అతని భార్య నాగమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురు(15)ను ఏడుకొండలు గత కొంత కాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తుండటంతో బుధవారం తల్లి నాగమ్మ సహాయంతో నున్న పోలీసు స్టేషన్లో మైనర్ బాలిక ఫిర్యాదు చేసింది. నున్న పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా గురువారం బాలిక తండ్రి ఏడుకొండలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా విచారణలో తన కూతురుకి మతి స్థిమితంలేదని ఏడుకొండలు చెప్పినట్లు పోలీసుల సమాచారం. -
చిన్నారిని కడతేర్చిన రెండో భార్య
మొదటి భార్య కొడుకుని భర్త ప్రేమగా చూస్తున్నాడనే అసూయే కారణం వెంకటాచలం: మొదటి భార్య బిడ్డను భర్త తన బిడ్డపై కంటే ప్రేమగా చూస్తున్నాడన్న అసూయతో అభం శుభం తెలియని మూడేళ్ల బాబును కడతేర్చింది ఓ మానవత్వం లేని తల్లి. ఈ సంఘటన పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌లో సీఐ శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. వెంకటాచలం మండలం ఈదగాలికి చెందిన ఏడుకొండలుకి నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డుకు చెందిన మల్లి శ్రీనివాసులు కుమార్తె అనితతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి చాలా కాలం వరకు పిల్లలు లేరు. ఏడుకొండలు గూడూరు ఎస్‌బీక్యూ స్టీల్ ఫ్యాక్టరీకి ట్యాంకర్ ద్వారా వాటర్ సప్లై చేస్తుంటారు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం అక్కడే పనిచేస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా లింగాల గ్రామానికి చెందిన గౌరీ అనే యువతితో పరిచయం ప్రేమగా మారడంతో వివాహం చేసుకున్నాడు. ఈమెను నెల్లూరు ఆటోనగర్ వర్క్‌ర్స్ కాలనీలో కాపురం పెట్టాడు. పెళ్లయిన ఏడాదికి వీరికి శరణ్య అనే పాప పుట్టింది. ఈ పెళ్లి విషయాన్ని ఏడుకొండలు మొదటి భార్య వద్ద దాచాడు. కొద్ది నెలలకు మొదటి భార్యకు సాయితేజ(3) పుట్టాడు. ఈ క్రమంలో బాబుపై ఏడుకొండలు ఎక్కువ ప్రేమ చూపుతున్నాడని గౌరీ అసూయ పడసాగింది. ఈ ఏడాది జూన్‌లో మొదటి భార్య ఆడపిల్లకు జన్మనిచ్చి..కుటుంబ సంక్షేమ ఆపరేషన్ చేయించుకునేందుకు నెల్లూరు ఆస్పత్రిలో చేరింది. దీంతో ఏడుకొండలు సాయితేజని తీసుకుని జూన్ 11న రెండో భార్య ఇంటికి వచ్చాడు. అనంతరం పనిపై ఇంటి నుంచి బయటికెళ్లగా రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గౌరీ.. సాయితేజ (2)ను ముక్కు, నోరు మూసి హతమార్చింది. ఈ విషయాలను పోలీసులు దర్యాప్తుల్లో వెల్లడయ్యాయి. చంటి బిడ్డను హతమార్చినందుకు గౌరీని, రెండో వివాహాన్ని దాచినందుకు ఏడుకొండలును పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. సీఐ వెంట ఎస్ఐ వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ సుబ్రమణ్యం, హోమ్ గార్డు సుచరిత ఉన్నారు.


