కూతురుని లైంగికంగా వేధిస్తున్న తండ్రి | Father daughter sexual abuse | Sakshi
Sakshi News home page

కూతురుని లైంగికంగా వేధిస్తున్న తండ్రి

Apr 22 2016 12:24 AM | Updated on Jul 23 2018 9:13 PM

కూతురుని లైంగికంగా వేధిస్తున్న తండ్రి - Sakshi

కూతురుని లైంగికంగా వేధిస్తున్న తండ్రి

కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో వడ్డెర కాలనీకి చెందిన ఏడుకొండలు అనే ...

అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు


విజయవాడ(అజిత్‌సింగ్‌నగర్) : కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో వడ్డెర కాలనీకి చెందిన ఏడుకొండలు అనే వ్యక్తిని నున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజీవ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన ఏడుకొండలు అతని భార్య నాగమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.


వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురు(15)ను ఏడుకొండలు గత కొంత కాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తుండటంతో బుధవారం తల్లి నాగమ్మ సహాయంతో నున్న పోలీసు స్టేషన్‌లో మైనర్ బాలిక ఫిర్యాదు చేసింది. నున్న పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా గురువారం బాలిక తండ్రి ఏడుకొండలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా విచారణలో తన కూతురుకి మతి స్థిమితంలేదని ఏడుకొండలు చెప్పినట్లు పోలీసుల సమాచారం.

 

 

Advertisement
 
Advertisement
Advertisement