స్వయంగా బావిలోకి దిగి శవాన్ని వెలికి తీసిన ఎస్‌ఐ

Karankote SI Went Down Into Well Recover Deceased Person Vikarabad - Sakshi

బావిలోని మృతదేహాన్ని స్వయంగా వెలికితీసిన ఎస్‌ఐ

తాండూరు రూరల్‌: ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ యువకుడు దుర్మరణం చెందగా.. ఎస్‌ఐ స్వయంగా బావిలోకి దిగి మృతదేహాన్ని వెలికి తీశారు. వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం కొత్లాపూర్‌లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్లాపూర్‌కు చెందిన రాయిపల్లి నర్సింహులు (30) హోలీ సంబరాల అనంతరం స్నానం చేసేందుకు ఓ బావి వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అతడు అందులో పడి మృతి చెందాడు.

అయితే, నీరు ఎక్కువగా ఉండటం, పురాతనమైనది కావడంతో గ్రామస్తులెవరూ ఆ బావిలోకి దిగేందుకు ముందుకు రాలేదు. దీంతో కరన్‌కోట్‌ ఎస్‌ఐ ఏడుకొండలు నడుముకు తాళ్లు కట్టుకొని స్వయంగా బావిలోకి దిగి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. దీంతో గ్రామస్తులు ఎస్సైని చప్పట్లతో అభినందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

చదవండి: యూనిఫామ్‌లోనే ఉరేసుకుని కానిస్టేబుల్‌ ఆత్మహత్య
సైబర్‌ నేరగాళ్ళు.. పోలీసులకే టోకరా!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top