ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేయబోయి.. | Bike bourne youth dies in road accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేయబోయి..

Oct 12 2016 3:55 PM | Updated on Apr 3 2019 7:53 PM

బైక్ పై వెళ్తున్న ఓ యువకుడు ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.

పశ్చిమగోదావరి: బైక్ పై వెళ్తున్న ఓ యువకుడు ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసం మండలంలోని పంజావేమవరం గ్రామానికి చెందిన భాస్కరరావు(23) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు.

ఈ క్రమంలో ఇంటి నుంచి బైక్ పై భీమవరానికి బయల్దేరాడు. గ్రామ శివారులో ట్రాక్టర్ ను దాటుతున్న సమయంలో ఎదురుగా ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు రావడంతో బైక్ తో దాన్ని ఢీ కొట్టాడు. తీవ్ర గాయాలపైన భాస్కర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. స్ధానికుల సమాచారంతో అక్కడి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement