సత్యదేవుని సన్నిధిలో భన్వర్‌లాల్‌ | bhanvarlal in annavaram temple | Sakshi
Sakshi News home page

సత్యదేవుని సన్నిధిలో భన్వర్‌లాల్‌

Jan 7 2017 10:30 PM | Updated on Sep 5 2017 12:41 AM

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ దంపతులు రత్నగిరిపై శనివారం సత్యదేవుని వ్రతమాచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేదపండితులు వేదాశీస్సులందజేశారు. తొలుత ఆలయం వద్ద వారికి దేవస్థానం చైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్, ఈఓ

అన్నవరం :
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ దంపతులు రత్నగిరిపై శనివారం సత్యదేవుని వ్రతమాచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేదపండితులు వేదాశీస్సులందజేశారు. తొలుత ఆలయం వద్ద వారికి దేవస్థానం చైర్మ¯ŒS రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పండితులు ఘన స్వాగతం పలికారు. చైర్మన్, ఈవోలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. భన్వర్‌లాల్‌ను జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు. పెద్దాపురం ఆర్‌డీవో విశ్వేశ్వరరావు, శంఖవరం తహసీల్దార్‌ వెంకట్రావు, ఎస్‌ఐ పార్థసారధి తదితరులున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement