తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ ద్వారా నిజామాబాద్ జిల్లాకు బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు రూ. 3.65 కోట్లు మంజూరు
బీసీ స్టడీ సర్కిల్‌కు రూ. 3.65 కోట్లుమంజూరు
Jul 27 2016 10:38 PM | Updated on Aug 9 2018 4:51 PM
కామారెడ్డిః తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ ద్వారా నిజామాబాద్ జిల్లాకు బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు రూ. 3.65 కోట్లు మంజూరు అయ్యాయని టీఆర్‌ఎస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పున్న రాజేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి జీవో ఆర్‌టీ నం. 194 జారీ అయ్యిందని వివరించారు. బీసీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం స్టడీ సర్కిల్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. బీసీ స్టడీ సర్కిల్ మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి పోచారం, ఎంపీలు కవిత, పాటిల్‌లతో పాటు ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Advertisement