సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ | bathukamma is traditional symbol | Sakshi
Sakshi News home page

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

Sep 19 2016 11:58 PM | Updated on Aug 29 2018 4:18 PM

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ - Sakshi

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

నల్లగొండ రూరల్‌ : తెలంగాణ సంస్క­ృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండగ అని బతుకమ్మ ఉత్సవ సమితి అధ్యక్షురాలు నూకల సంధ్యారాణి అన్నారు.

నల్లగొండ రూరల్‌ : తెలంగాణ సంస్క­ృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండగ అని బతుకమ్మ ఉత్సవ సమితి అధ్యక్షురాలు నూకల సంధ్యారాణి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బోయవాడలో బతుకమ్మ ఉత్సవ సమితి  కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. మహిళలు బతుకమ్మ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించి సంస్క­ృతి, సంప్రదాయాలను ఘనంగా చాటిచెప్పాలన్నారు.  ప్రకృతి ప్రసాదించిన పూలతో బతుకమ్మలను నిర్వహించడం ఆడపడుచులకు గర్వ కారణమన్నారు.  సంబరాలను వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూతురు సత్యవతి, శ్రీలత, పద్మ, కోటగిరి రమ్యశాంతి, లక్ష్మి, శోభ, జ్యోతి, సుజాత, జయశ్రీ, కాశమ్మ, విజయలక్ష్మి, అర్చన, డాక్టర్‌ అనిత, డాక్టర్‌ ఇందిర తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement