ఓ మహిళకు బ్యాంక్ అధికారినంటూ ఫో¯ŒS చేసి రూ.32,500 డ్రా చేసిన సంఘటన మడికొండలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జూబేద బేగంకు గుర్తు తెలియని వ్యక్తి ఫో¯ŒS చేసి ఆంధ్రా బ్యాంక్ మేనేజర్‌ని మాట్లాడుతున్నానంటూ హిందీలో చెప్పాడు
-
అకౌంట్ నుంచి రూ.32,500 డ్రా
మడికొండ : ఓ మహిళకు బ్యాంక్ అధికారినంటూ ఫో¯ŒS చేసి రూ.32,500 డ్రా చేసిన సంఘటన మడికొండలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జూబేద బేగంకు గుర్తు తెలియని వ్యక్తి ఫో¯ŒS చేసి ఆంధ్రా బ్యాంక్ మేనేజర్‌ని మాట్లాడుతున్నానంటూ హిందీలో చెప్పాడు. మీ ఏటీఎం కార్డు డెడ్ అయిపోయింది. కొత్తది పంపిస్తాం లేకుంటే బ్లాక్ అవుతుందని చెప్పి మీ ఏటీఎం కార్డుపై ఉన్న నంబర్ చెప్పాలని అడిగాడు. ఇందుకు ఆమె ఎటీఎంపై ఉన్న నంబర్లు చెప్పగానే మూడు నిమిషాల్లోనే మొదటిసారి రూ.25,000, రెండవసారి రూ.7,500 అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసినట్లు సెల్‌కు మెసేజ్ అందడంతో ఇంట్లో వారికి విషయం చెప్పింది. దీంతో వెంటనే స్థానిక పోలీసు స్టేష¯Œలో ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.