బ్యాంక్ మేనేజర్‌పై అటెండర్ కత్తి దాడి.. | bank manager attacked by attender srikanth in karimnagar district | Sakshi
Sakshi News home page

బ్యాంక్ మేనేజర్‌పై అటెండర్ కత్తి దాడి..

Oct 3 2015 7:50 PM | Updated on Sep 3 2017 10:23 AM

బ్యాంక్ మేనేజర్‌పై అటెండర్ కత్తి దాడి..

బ్యాంక్ మేనేజర్‌పై అటెండర్ కత్తి దాడి..

కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం సెంటినరీ కాలనీలోని దక్కన్ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌పై అటెండర్ కత్తితో దాడి చేశాడు.

పెద్దపల్లి: కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం సెంటినరీ కాలనీలోని దక్కన్ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌పై అటెండర్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బ్యాంకు మేనేజర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం సాయంత్రం బ్యాంకులో విధులు ముగించుకుని మేనేజర్ రామానుజాచార్యులు కారులో పెద్దపల్లిలోని తన నివాసానికి బయల్దేరారు. అదే బ్యాంకులో అటెండర్‌గా పనిచేసే శ్రీకాంత్ కారు డ్రైవ్ చేస్తున్నాడు.

పెద్దపల్లి సమీపంలో కారును ఆపిన శ్రీకాంత్ తన దగ్గరున్న కత్తితో మేనేజర్ రామానుజాచార్యులు పొట్టలో మూడు సార్లు పొడిచాడు. అనంతరం అటెండర్ అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన మేనేజర్కు పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి అనంతరం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement