బంద్‌ను జయప్రదం చేయండి
పాలకొల్లు టౌన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేయడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని పోరాటం చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడు కేంద్రానికి తలొగ్గి ప్యాకేజీ వైపు మొగ్గుచూపడం దారుణమని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు.
పాలకొల్లు టౌన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేయడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని పోరాటం చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడు కేంద్రానికి తలొగ్గి ప్యాకేజీ వైపు మొగ్గుచూపడం దారుణమని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు. ప్రత్యేక హోదా రాకపోతే యువత నిరుద్యోగంతో పాటు రైతులు, ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా కోసం శనివారం తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ రాష్ట్రవ్యాప్త బంద్‌లో వర్తక సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.