చండీయాగంలో బాలయ్య | balayya participated in chandiyagam | Sakshi
Sakshi News home page

చండీయాగంలో బాలయ్య

Nov 26 2016 11:47 PM | Updated on Sep 4 2017 9:12 PM

చండీయాగంలో బాలయ్య

చండీయాగంలో బాలయ్య

మహారుద్రయాగ సహిత చండీ నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు.

బంజారాహిల్స్‌: లోక కల్యాణార్థం బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.14లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి విజయగణపతి ఆలయంలో జరుగుతున్న మహారుద్రయాగ సహిత చండీ మహాయాగంలో ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈనెల 17న ప్రారంభమైన యాగం శనివారంతో ముగిసింది. చవరిరోజు బాలకృష్ణ పాల్గొని మహాపూర్ణాహుతి నిర్వహించారు. విజయగణపతి ఆలయం ప్రధాన అర్చకుడు విష్ణుభట్ల ఆంజనేయ చయనులు నేతృత్వంలో ఈ మహాయాగం జరిగింది. విశేష పూజల్లో భక్తులు పాల్గొని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement