బ్యాడ్మింటన్‌ టోర్నీ ఓవరాల్‌ చాంపియన్లుగా ఇంజినీరింగ్, కమర్షియల్‌ జట్లు | badmintal tourney winners | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్‌ టోర్నీ ఓవరాల్‌ చాంపియన్లుగా ఇంజినీరింగ్, కమర్షియల్‌ జట్లు

Oct 7 2016 10:46 PM | Updated on Sep 4 2017 4:32 PM

బ్యాడ్మింటన్‌ టోర్నీ ఓవరాల్‌ చాంపియన్లుగా ఇంజినీరింగ్, కమర్షియల్‌ జట్లు

బ్యాడ్మింటన్‌ టోర్నీ ఓవరాల్‌ చాంపియన్లుగా ఇంజినీరింగ్, కమర్షియల్‌ జట్లు

విజయవాడ డీఆర్‌ఎం బ్యాడ్మింటన్‌ కప్‌ టోర్నీలో ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను ఇంజినీరింగ్, కమర్షియల్‌ జట్లు సంయుక్తంగా కైవసం చేసుకున్నాయి.

 విజయవాడ స్పోర్ట్స్‌ : విజయవాడ డీఆర్‌ఎం బ్యాడ్మింటన్‌ కప్‌ టోర్నీలో ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను ఇంజినీరింగ్, కమర్షియల్‌ జట్లు సంయుక్తంగా కైవసం చేసుకున్నాయి. సత్యనారాయణపురం రైల్వే ఇనిస్టిట్యూట్‌లో నిర్వహించిన టోర్నీలో  డబుల్స్‌ ఫైనల్స్‌లో బాబావల్లి, పర్మేష్‌ (ఇంజినీరింగ్‌)జోడీ 19–21, 21–17, 21–14 తేడాతో బీఎల్‌వీ పవన్, ప్రసాద్‌ (కమర్షియల్‌)జోడీపై విజయం సాధించారు. సింగిల్స్‌లో బీఎల్‌వీ పవన్‌(కమర్షియల్‌) 21–18, 21–19 తేడాతో పర్మేష్‌ (ఇంజినీరింగ్‌)పై విజయం సాధించారు. వెటరన్‌ విభాగంలో వి.సోమేశ్వరరావు, ఎస్‌.రుషికేశవ (ఇంజినీరింగ్‌) జోడ్యా 21–17, 21–16 తేడాతో పి.శ్రీనివాసరావు, జి.శ్రీనివాసరావు (కమర్షియల్‌) జోడీపై గెలుపొందారు. టోర్నీ గురువారం రాత్రి ముగిసింది. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం కె.వేణుగోపాలరావు, డివిజనల్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ జె.ప్రదీప్‌కుమార్, రైల్వే ఇనిస్టిట్యూట్‌ చైర్మన్‌ పి.శ్రీనివాసరావు, స్పోర్ట్స్‌ వెల్ఫేర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.అర్జునరావు పాల్గొన్నారు. 
 
  
 
 

Advertisement
 
Advertisement
Advertisement