గోడ కూలి చిన్నారి మృతి | baby died in accident | Sakshi
Sakshi News home page

గోడ కూలి చిన్నారి మృతి

Jul 30 2016 12:29 AM | Updated on Sep 4 2017 6:57 AM

నల్లకాల్వ గ్రామంలో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో గోడకూలి చిన్నారి మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

ఆత్మకూరురూరల్‌: నల్లకాల్వ గ్రామంలో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో గోడకూలి చిన్నారి మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గ్రామంలోని ప్రేమజ్యోతి, ప్రేమ్‌కుమార్‌ దంపతులకు 6 నెలల క్రితం కుమార్తె పుట్టింది. ఇంకా పేరు కూడా పెట్టలేదు. వీరు రేకులషెడ్డులో నివాసం ఉంటున్నారు. చిన్నారిని ఊయలలో నిద్రపుచ్చిన తల్లి ప్రేమజ్యోతి, అమ్మమ్మ శేషమ్మలు పక్కనే నిద్రించారు. కాగా పక్కనున్న మిద్దె గోడ కూలి రేకుల షెడ్‌పై పడింది. దీంతో ఊయలలో నిద్రిస్తున్న చిన్నారి తీవ్రంగా గాయపడి మతి చెందింది. చిన్నారి తల్లి, అమ్మమ్మలకు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు.    
 

Advertisement
 
Advertisement
Advertisement