శ్రీవారి ఆర్జిత సేవల లక్కిడిప్‌ ఆగస్టు కోటా విడుదల | august kota, sreevari, aarjitha sevalu | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆర్జిత సేవల లక్కిడిప్‌ ఆగస్టు కోటా విడుదల

Jul 30 2016 10:04 PM | Updated on Jul 12 2019 4:28 PM

తిరుమల వేంకటేశ్వర స్వామి వారు - Sakshi

తిరుమల వేంకటేశ్వర స్వామి వారు

తిరుమల వేంకటేశ్వర స్వామి వారు

సాక్షి,తిరుమల: తిరుమలలో లక్కీడిప్‌ కింద కేటాయించే శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు కోటా శనివారం టీటీడీ ప్రజా సంబంధాల విభాగం విడుదల చేసింది. శ్రీవారి ఆర్జిత సేవలకు ముందురోజు సాయంత్రం 5 గంటల్లోగా కేంద్రీయ విచారణ కార్యాలయం (సీఆర్‌వో)లోని విజయాబ్యాంక్‌ కౌంటర్‌లో లక్కీడిప్‌ ద్వారా టికెట్లు కేటాయిస్తారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5గంటల వరకు భక్తులు తమ వ్యక్తిగత వివరాలు, వేలిముద్రలు, సెల్‌ నెంబర్‌ కంప్యూటర్‌లో నమోదు చేసుకుని టోకెన్‌ పొందాలి. నమోదు చేసుకున్న వారిలో కంప్యూటర్‌ ర్యాండమ్‌ పద్ధతిలో అందుబాటులో ఉన్న ఆర్జిత సేవాటికెట్లు  కేటాయిస్తారు. తర్వాత ఎంపికైన భక్తుల సెల్‌ నెంబరుకు ఎస్‌ఎంఎస్‌ రూపంలో సమాచారం అందజేస్తారు. రాత్రి 8 గంటల్లోపు భక్తులు ఆ టికెట్టు కొనుగోలు చేయాలి.  శుక్రవారం నిర్వహించే పురాభిషేకం, మేల్‌చాట్‌ వస్త్రం టికెట్లను రెండో విడత లక్కీడిప్‌లో కేటాయిస్తారు. వీటిని రాత్రి 10 గంటల్లోపు భక్తులు పొందవచ్చు. సామాన్య భక్తులు కూడా లక్కీడిప్‌ ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ అరుదైన ఆర్జిత సేవల్లో పాల్గొని స్వామివారి దివ్య మంగళరూపాన్ని దర్శించుకుని ఆనంద పరవశులవుతున్నారు.  

ఆగస్టు లక్కీడిప్‌ కోటా వివరాలు
                            తోమాల        అర్చన      వస్త్రం     పూరాభిషేకం

02.08.2016            06              17            –            –

03.08.2016             07            15             –              –

04.08.2016             07        26                  –               –
05.08.2016            –        –    01               35
09.08.2016            06        12                    –              –
10.08.2016            05        18                   –                 –
11.08.2016            –        09                      –                 –
12.08.2016            –        –    02               –
16.08.2016             పవిత్రోత్సవం సందర్భంగా  రద్దు
17.08.2016            –        31    –    –
18.08.2016            –        –    –    –
19.08.2016            –        –    02    –
23.08.2016            –        06    –    –
24.08.2016            –        –    –    –
25.08.2016            –        17    –    –
26.08.2016            –        –    01    –
30.08.2016            –        –    –    –
31.08.2016            –        45    –    –

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement